Header Banner

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

  Mon May 05, 2025 09:25        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఒక యాప్‌ను తీసుకురానుంది, దీని ద్వారా వారు ఇంటి నుంచే రుణాలు, పొదుపు చెల్లించవచ్చు. ఈ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపులు సులభతరం అవుతాయి, బ్యాంకులకు వెళ్లే అవసరం తప్పుతుంది. అంతేకాకుండా, కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు భారీగా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ప్రజా పాలన అందిస్తోంది. ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వందల ప్రభుత్వ సర్వీసులు ప్రజల అర చేతుల్లోకి వచ్చి చేరాయి. దాంతో ప్రజలు ఇంట్లో నుంచే ప్రభుత్వ సర్వీసులు సులభంగా పొందవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. వారు ఇకపై ఇంటి వద్ద నుంచే డ్వాక్రా రుణాలు, పొదుపు చెల్లించిలే.. వారి కోసం ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

డ్వాక్రా మహిళల కోసం యాప్..
డ్వాక్రా రుణ వాయిదాల చెల్లింపు కోసం మహిళలు ప్రతీ నెల బ్యాంకులకు వెళ్తుంటారు. అక్కడకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లో నిలబడి అవస్థలు పడుతుంటారు. ఈక్రమంలో ఏపీ ప్రభుత్వం.. ఈ సమస్యలను అధిగమించేందుకు, స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు సులభం చేసేలా.. వారి కోసం ఓ యాప్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మొబైల్ యాప్‌తో స్వయం సహాయక సంఘాల సభ్యులు చాలా సులభంగా, పారదర్శకతతో రుణాల చెల్లింపులను సులభతరం చేసే అవకాశం ఉంది.

 

డ్వాక్రా రుణాల చెల్లింపు కోసం గ్రూప్ తరపున ప్రతి నెలా ఒకరు డబ్బులు వసూలు చేసి వాటిని బ్యాంకుల్లో జమ చేస్తుంటారు. ఒక వ్యక్తి పని మానుకుని.. రోజంతా దీని కోసమే కేటాయించాల్సి వస్తుంది. అలానే స్త్రీనిధి రుణాలకు సంబంధించి వసూలు చేసిన వాళ్లు బ్యాంకులో నగదు జమ చేయకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం రుణ చెల్లింపు ప్రక్రియను ఆన్ లైన్ చేయాలని భావించింది. దీనిలో భాగంగా డ్వాక్రా రుణ చెల్లింపు యాప్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

 


యాప్ వల్ల లాభాలు..
ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. డ్వాక్రా సభ్యులు తమ రుణ వాయిదాల చెల్లింపు కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే వాయిదాలు చెల్లించుకోవచ్చు. అంతేకాక యాప్ వినియోగం వల్ల డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించవచ్చు. నగదు బదిలీ మోసాలు తగ్గుతాయి. తక్షణ చెల్లింపుతో సభ్యుల సమయం ఆదా అవుతుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #DWCRA #SelfHelpGroups #WomenEmpowerment #DigitalPayments #APGovernment #SHGLoans #DWCRAWomen